![]() |
![]() |

భారతీయ సినీ పరిశ్రమతో బాలీవుడ్ బాద్షా, కింగ్ షారుక్ ఖాన్(shah rukh khan)కి ఉన్న క్యాపబిలిటీ తెలిసిందే. ప్రస్తుతం 'కింగ్' మూవీతో బిజీగా ఉన్నాడు.సదరు చిత్రంతో రికార్డు లెక్కలని సరి చెయ్యాలనే పట్టుదల షారుక్ లో కనిపిస్తుంది.
మిల్కీ బ్యూటీ తమన్నా(tamannaah)క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.తమన్నా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతు షారుక్ కుమారుడు ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో వచ్చిన ఆర్యన్ ఖాన్ దర్శకుడిగా పరిచయమైన 'ది బాస్టర్డ్స్ ఆఫ్ బాలీవుడ్' కోసం స్వయంగా షారుఖ్ ఖాన్ నాకు ఫోన్ చేసి ఆహ్వానించారు. అప్పట్లో దాదాపు 200 మంది సిబ్బంది ఉన్న సెట్లో ప్రతి ఒక్కరితోను కింగ్ ఖాన్ ఎంతో ఆప్యాయంగా ఫోటోలు దిగడం నన్నుబాగా ఆకట్టుకుంది.అదే గౌరవంతో, ఆర్యన్ ఖాన్ డెబ్యూ సిరీస్ కోసం షారుఖ్ ఖాన్ అడగగానే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే ఒప్పుకున్నాను. 'గఫూర్' సాంగ్ షూటింగ్ కేవలం ఒకే ఒక్క రోజులో పూర్తయింది. ఇంత తక్కువ సమయంలో అంతటి అద్భుతమైన అవుట్‌పుట్ రావడం వెనుక ఆర్యన్ ఖాన్ అద్భుతమైన ప్రతిభ ఉం ది. కేవలం 20 ఏళ్ల వయసులోనే ఆర్యన్ ఖాన్‌కు సినిమా పట్ల, కథల పట్ల ఉన్న స్పష్టత, అవగాహన నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచాయి.
Also read: Allu arjun: అల్లుఅర్జున్ దెబ్బకి రాజాసాబ్, పెద్ది రికార్డ్స్ అవుట్
తన కెరీర్లో ఎందరో స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న తమన్నా, షారుఖ్ ఖాన్‌తో కలిసి గతంలో బ్రాండ్ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్లలో పనిచేసింది. ఇక తమన్నా సాంగ్ విడుదలైన తర్వాత నెట్టింట తమన్నా లుక్స్ ,బాడీ ట్రాన్స్ఫార్మేషన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కొంతమంది నెటిజన్లు ఆమె బరువు తగ్గడం వెనుక ఓజెంపిక్ వంటి మందులు ఉన్నాయని, మరికొందరు విడిపోవడం వల్ల వచ్చిన మార్పులని రకరకాల పుకార్లు సృష్టించారు. వీటిపై కూడా తమన్నా ఎంతో హుందాగా సమాధానమిచ్చింది. 15 ఏళ్ల వయసులోనే కెమెరా ముందుకు వచ్చిన తనకు, ప్రేక్షకుల ముందు దాచడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. 30 ఏళ్ల వయసులో కోవిడ్ ప్రభావం వల్ల తన శరీరంలో వచ్చిన హార్మోనల్ మార్పులు, ఇన్ఫ్లమేషన్ను ఎదుర్కోవడం కాస్త కష్టమైందని, కానీ గ్లోబల్ బ్యూటీ స్టాండర్డ్స్ కోసం కాకుండా తన సింధీ మూలాలకు సరిపోయే సహజమైన లుక్‌ను తాను ఎప్పుడూ ఇష్టపడతానని వివరించింది. ఆర్యన్ ఖాన్ దర్శకత్వ ప్రతిభ, షారుఖ్ ఖాన్ చూపించే అపారమైన ప్రేమ, గౌరవమే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో భాగమవడానికి అసలైన కారణమని మిల్కీ బ్యూటీ ముగించింది.
![]() |
![]() |